ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడ బీజేపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన విద్యార్థులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడ బీజేపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన విద్యార్థులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్కు వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన జేఏసీ నాయకులు విజయవాడలోని బీజేపీ కార్యాయం ఎదుట నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా.. బీజేపీ నాయకులు అడ్డుకుని వారిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ చర్యను వైఎస్ఆర్ సీపీ నాయకులు ఖండించారు.