ఆటో బోల్తా : విద్యార్థులకు గాయాలు | Students injured in auto overturned in paritala | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా : విద్యార్థులకు గాయాలు

Aug 9 2016 10:09 AM | Updated on Nov 9 2018 4:44 PM

కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పరిటాల వద్ద మంగళవారం ఆటో అదుపు తప్పి బోల్తా పడింది.

విజయవాడ : కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పరిటాల వద్ద మంగళవారం ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ప్రైవేటు స్కూలుకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం కంచికచర్లలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని... ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 22 మంది విద్యార్థులు ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement