రైఫిల్‌ షూటింగ్‌లో విజ్ఞాన్‌ విద్యార్థిని ప్రతిభ | Student talent in refile shooting competion | Sakshi
Sakshi News home page

రైఫిల్‌ షూటింగ్‌లో విజ్ఞాన్‌ విద్యార్థిని ప్రతిభ

Jul 25 2016 10:01 PM | Updated on Nov 9 2018 4:59 PM

రైఫిల్‌ షూటింగ్‌లో తమ విద్యార్థిని బోయపాటి తేజస్వి ఉత్తమ ప్రతిభ కనబరిచిందని విజ్ఞాన్‌ యూనివర్సిటీ బీటెక్‌ ఫస్టియర్‌ విభాగాధిపతి ఎన్‌.శ్రీనివాసు తెలిపారు.

చేబ్రోలు : రైఫిల్‌ షూటింగ్‌లో తమ విద్యార్థిని బోయపాటి తేజస్వి ఉత్తమ ప్రతిభ కనబరిచిందని విజ్ఞాన్‌ యూనివర్సిటీ బీటెక్‌ ఫస్టియర్‌ విభాగాధిపతి ఎన్‌.శ్రీనివాసు తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీలో సోమవారం విద్యార్థినికి అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసు మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి 24 వరకు గుంటూరులోని బ్రాడిపేటలో ఉన్న  ఇండియన్‌ అకాడమీ షూటింగ్‌ స్పోర్ట్‌లో రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో 17వ రాష్ట్రస్థాయి రైఫిల్‌ షూటింగ్‌ పోటీలు జరిగాయని తెలిపారు. ఎయిర్‌ పిస్టల్‌ జూనియర్, సీనియర్‌ మహిళల విభాగాల్లో తమ విద్యార్థిని బోయపాటి తేజస్వి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రెండు స్వర్ణపతకాలు సాధించినట్లు తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థినిని ఛైర్మన్‌ లావు రత్తయ్య, వైస్‌ ఛైర్మన్‌ శ్రీకృష్ణదేవరాయలు, వీసీ డాక్టర్‌ సి.తంగరాజ్, రెక్టార్‌ బి.రామ్మూర్తి తదితరులు అభినందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement