breaking news
Rifile shooting
-
రైఫిల్ షూటింగ్లో విజ్ఞాన్ విద్యార్థిని ప్రతిభ
చేబ్రోలు : రైఫిల్ షూటింగ్లో తమ విద్యార్థిని బోయపాటి తేజస్వి ఉత్తమ ప్రతిభ కనబరిచిందని విజ్ఞాన్ యూనివర్సిటీ బీటెక్ ఫస్టియర్ విభాగాధిపతి ఎన్.శ్రీనివాసు తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో సోమవారం విద్యార్థినికి అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసు మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి 24 వరకు గుంటూరులోని బ్రాడిపేటలో ఉన్న ఇండియన్ అకాడమీ షూటింగ్ స్పోర్ట్‌లో రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 17వ రాష్ట్రస్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలు జరిగాయని తెలిపారు. ఎయిర్ పిస్టల్ జూనియర్, సీనియర్ మహిళల విభాగాల్లో తమ విద్యార్థిని బోయపాటి తేజస్వి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రెండు స్వర్ణపతకాలు సాధించినట్లు తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థినిని ఛైర్మన్ లావు రత్తయ్య, వైస్ ఛైర్మన్ శ్రీకృష్ణదేవరాయలు, వీసీ డాక్టర్ సి.తంగరాజ్, రెక్టార్ బి.రామ్మూర్తి తదితరులు అభినందించారు. -
రైఫిల్ షూటింగ్ పోటీలు ప్రారంభం
గుంటూరు స్పోర్ట్స్: జాతీయ, అంతర్జాతీయ పోటీలలో అత్యధిక పతకాలు సాధించేందుకు అవకాశం వున్న క్రీడ రైఫిల్ షూటింగ్ అని శాప్ ఓఎస్డీ, గుంటూరు జిల్లా ఇన్చార్జ్ డీఎస్డీఓ పి.రామకష్ణ అన్నారు. ఆంద్రప్రదేశ్ రైఫిల్ అసోసియేషన్ అధ్వర్యంలో బుధవారం స్దానిక బ్రాడీపేటలోని రైఫిల్ షూటింగ్ అకాడమిలో 17వ ఏ.పీ స్టేట్ షూటింగ్ ఛాంపియన్ షిప్–2016 పోటీలు ప్రారంభం అయ్యాయి. ముఖ్యఅతిధిగా హజరైన రామకష్ణ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఒలంపిక్స్, కామన్వెల్త్ క్రీడల్లో మన క్రీడాకారులు అనే పతకాలు సాధించారని చెప్పారు. వ్యక్తిగత విభాగంలో అనేక పతకాలు సాధించే అవకాశం వున్న క్రీడ రైఫిల్ షూటింగ్ అన్నారు. అంతే కాకుండా తక్కువ సమయంలో జాతీయ, అంతర్జాతీయ స్ధాయికి ఎదిగే అవకాశం వుందన్నారు. టోర్నమెంట్లో పురుషుల, మహిళాల, సబ్ జూనియర్, జూనియర్, వెటరన్ విభాగాలలో పోటీలు జరుగుతాయని టోర్నమెంట్ నిర్వహకులు వెల్లడించారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, ఎయిర్ ఫిస్టల్ క్రీడాంశాలలో పోటీలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో బీ.శ్రీనివాసరావు, క్రీడాకారులు, తదితరులు పాల్గోన్నారు.