డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ బాలిక మృతి | Student died at school in karimnagar district | Sakshi
Sakshi News home page

డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ బాలిక మృతి

Aug 14 2015 8:14 PM | Updated on Nov 9 2018 5:02 PM

డ్యాన్ ప్రాక్టీస్ చేస్తుండగా బాలిక మృతి చెందిన సంఘటన వెలగటూరు మండలంలో కుమ్మర్‌పల్లిలో చోటు చేసుకుంది.

కరీంనగర్ : డ్యాన్ ప్రాక్టీస్ చేస్తుండగా బాలిక మృతి చెందిన సంఘటన వెలగటూరు మండలంలో కుమ్మర్‌పల్లిలో చోటు చేసుకుంది. వెలగటూరు మండలానికి చెందిన కృష్ణవేణి(13) అనే బాలిక కుమ్మర్‌పల్లి గ్రామంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పాఠశాలలో డ్యాన్ ప్రాక్టీస్ చేస్తుండగా ఆకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయింది. ఆమెను పాఠశాల సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించే లోపే కృష్ణవేణి ప్రాణాలు విడిచింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement