ఇంటర్ పరీక్షల్లో భాగంగా మంగళవారం జరిగిన ద్వితీయìæ సంవత్సరం గణితం, బాటనీ, సివిక్స్, ఒకేషనల్ పరీక్షల్లో ఒక విద్యార్థి డీబార్ అయ్యాడు.
అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్ పరీక్షల్లో భాగంగా మంగళవారం జరిగిన ద్వితీయìæ సంవత్సరం గణితం, బాటనీ, సివిక్స్, ఒకేషనల్ పరీక్షల్లో ఒక విద్యార్థి డీబార్ అయ్యాడు. కదిరి పట్టణం స్పేస్ జూనియర్ కళాశాల కేంద్రంలో ఓ విద్యార్థి కాపీ కొడుతూ డీబార్ అయ్యాడు. మొత్తం 31,871 మంది విద్యార్థులకు గానూ 31,092 మంది హాజరయ్యారు. 779 మంది గైర్హాజయ్యారు.
వీరిలో జనరల్ విద్యార్థులు 29,510 మంది విద్యార్థులకు గానూ 28,794 మంది హాజరయ్యారు. 716 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ పరీక్షకు సంబంధించి 2,361 మంది విద్యార్థులకు గానూ 2,298 మంది హాజరయ్యారు. 63 మంది గైర్హాజరయ్యారు.