గ్రానైట్‌ అక్రమాలను అరికట్టాలి | stop the granet illeagal transport | Sakshi
Sakshi News home page

గ్రానైట్‌ అక్రమాలను అరికట్టాలి

Sep 6 2016 10:53 PM | Updated on May 29 2018 4:26 PM

గ్రానైట్‌ అక్రమాలను అరికట్టాలి - Sakshi

గ్రానైట్‌ అక్రమాలను అరికట్టాలి

జిల్లాలో అనుమతులు లేకుండా, అక్రమంగా గ్రానైట్‌ తవ్వకాలు చేపట్టడాన్ని అరికట్టాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గ్రానైట్‌ అక్రమ క్వారీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

  • వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా 
  • మంకమ్మతోట : జిల్లాలో అనుమతులు లేకుండా, అక్రమంగా గ్రానైట్‌ తవ్వకాలు చేపట్టడాన్ని అరికట్టాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గ్రానైట్‌ అక్రమ క్వారీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. కుమార్‌ మాట్లాడుతూ.. జిల్లాలో అనుమతులు లేకుండా గ్రానైట్‌ తవ్వకాలు చేపడుతుంటే రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఖనిజ సంపదను దోపిడిచేస్తూ భూమిపై జీవరాశులకు నిలువలేకుండా చేస్తున్నా మాఫియాను అడ్డుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్వారీల్లో బ్లాస్టింగ్‌ చేపట్టడం వల్ల శబ్ద, వాయు కాలుష్యంతో ప్రజల ప్రాణాలకు సైతం ముప్పు ఉందన్నారు. జిల్లాలో 613 గ్రానైట్‌ క్వారీలకు అనుమతి ఉంటే 800 వరకు క్వారీలు నడుస్తున్నాయన్నాని తెలిపారు. గ్రానైట్‌ అక్రమ తరలింపును అడ్డుకునేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. మైన్స్‌ ఎండీ కార్యాలయాన్ని కలెక్టరేట్‌ సముదాయంలోకి మార్చాలన్నారు. పదేళ్లుగా సాగుతున్న గ్రానైట్‌ అక్రమ దందాపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్‌ కె.నగేష్, సెగ్గెం రాజేష్, సొల్లు అజయ్‌వర్మ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు వరాల శ్రీనివాస్, గాలి ప్రశాంత్‌బాబు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి మోకెనపెల్లి రాజమ్మ, సంయుక్త కార్యదర్శి గడ్డం జలజరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు బోగె పద్మ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు దేవరనేణి వేణుమాధవ్‌రావు, వినుకొండ రామకృష్ణరెడ్డి, మందరాజేష్, నాయకులు సిరి రవి, జక్కుల యాదగిరి, సాన రాజన్న,  దుబ్బాక సంపత్, గండి శ్యామ్, కంది వెంకటరమణారెడ్డి, బండమీది అంజయ్య, పావురాల కనుకయ్య, చొక్కాల రాము, గంటుక సంపత్‌ పాల్గొన్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement