అమ్మాయిలతో పైనాన్స్ ఎర | Star Health and Alain Insurance Company cheating | Sakshi
Sakshi News home page

అమ్మాయిలతో పైనాన్స్ ఎర

Nov 25 2016 10:37 PM | Updated on May 10 2018 12:34 PM

అమ్మాయిలతో పైనాన్స్ ఎర - Sakshi

అమ్మాయిలతో పైనాన్స్ ఎర

మీరు బెస్ట్ కపుల్స్‌కు ఎంపికయ్యారు. మీకు ఊహించని గిప్ట్ ఫ్యాక్ తగిలింది. డబ్బు కట్టనవసరం లేదు.ఆఫీసుకు వచ్చి గిప్ట్ తీసుకెళ్లండంటూ అమ్మాయిలు

--గిప్ట్ కూపన్ తగిలిందని మాయమాటలు
--నమ్మి ఆఫీసుకు వస్తే ఇన్సూరెన్స్ అంటూ గారడీ
--రూ.లక్షలు కట్టించుకుని బాండ్లు ఇవ్వని వైనం
--బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు
 
మదనపల్లె టౌన్: మీరు బెస్ట్ కపుల్స్‌కు ఎంపికయ్యారు. మీకు ఊహించని గిప్ట్ ఫ్యాక్ తగిలింది. డబ్బు కట్టనవసరం లేదు.ఆఫీసుకు వచ్చి గిప్ట్ తీసుకెళ్లండంటూ అమ్మాయిలు ఫోన్‌లో సంభాషించి ఎరవేస్తారు. తీరా నమ్మి వాళ్ల ఆఫీసుకు వెళ్తే మాయ మాటలతో గారడీ చేస్తారు. వారి మాయమాటలలో పడివిన వారి వద్ద రూ.లక్షలు ఇన్సూరెన్స్ పేరుతో కట్టించుకుని మోసం చేస్తారు.ఇలా ఒకరిద్దరు కాదు వేల మందిని తరచూ ఫోన్‌లలో ప్రలోభపెట్టి మోసం చేసి డబ్బు కాజేస్తున్న స్టార్‌హెల్త్ అండ్ అలైన్ ఇన్సూరెన్స్ కంపెనీ బాగోతం శుక్రవారం మదనపల్లెలో వెలుగు చూసింది. టూటౌన్ ఎస్‌ఐలు గంగిరెడ్డి,నాగేశ్వరావుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
 
 రిలయన్స్‌లైఫ్ ఇన్సూరెన్స్ ఛానల్ డెవలప్‌మెంట్ అసోసియేట్ పేరును ఉపయోగిస్తూ  అనంతపురం, కర్నూల్, చిత్తూరు జిల్లాలలో ఇన్సూరెన్స్ కంపెనీ పేరుమీద ఈ బోగస్ కంపెనీ నడుస్తోందన్నారు. స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని కేకే కాంప్లక్స్‌లో గత రెండేళ్లుగా సుమారు 10 మంది యువతులతో ఈ వ్యవహారం సాగిస్తున్నారన్నారు. నిర్వాహకురాలు అనంతపురానికి చెందిన పద్మప్రియగా పట్టుబడిన నిర్వాహకులు తెలిపారని చెప్పారు. ఈ సంస్థ ఆరు నెలలుగా ఎవరికి బాండ్లు ఇవ్వకపోవడంతో నమ్మి నగదు డిఫాజిట్ చేసిన బాధితులు పలువురు శుక్రవారం నిర్వాహకులను నిలదీయడం జరిగిందన్నారు. 
 
వారి వద్ద నుంచి సరైన సమాధానం లేకపోవడంతో ఫిర్యాదు చేశారని చెప్పారు.  వెంటనే రంగ ప్రవేశం చేసి విచారణ చేపట్టగా అంతా బోగస్ అని తేలిందని చెప్పారు. ఇక్కడ ప్రజలను మోసం చేస్తున్న నిర్వాహకులు అశోక్, మరి కొంత మందిని అదుపులోకి తీసుకుని , రికార్డులను,కంప్యూటర్లు, ల్యాబ్‌టాప్‌లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. విచారణ అనంతరం ఎంతమేరకు నగదు మోసం చేశారు, కంపెనీ నిబంధనలు పాటిస్తోందా లేదో విచారణలో తేలాల్సివుందన్నారు.ఈ దాడుల్లో ఎస్‌ఐలు గంగిరెడ్డి,నాగేశ్వరావు, స్పషల్ బ్రాంచ్ సీఐ, ఎస్‌ఐలు మునిరాజ, గణి, శివ తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement