నేటి నుంచి ‘రత్నగిరి’పై శ్రీరామనవమి వేడుకలు | sriramanavai festival in annavaram | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ‘రత్నగిరి’పై శ్రీరామనవమి వేడుకలు

Apr 3 2017 11:08 PM | Updated on Oct 1 2018 6:33 PM

రత్నగిరిపై గల రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు మంగళవారం నుంచి తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రత్నగిరిపై సత్యదేవుడు ఆవిర్భవించినప్పటి నుంచి క్షేత్ర పాలకుడిగా శ్రీరాముడు

అన్నవరం :
రత్నగిరిపై గల రామాలయంలో  శ్రీరామనవమి వేడుకలు మంగళవారం నుంచి తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రత్నగిరిపై సత్యదేవుడు ఆవిర్భవించినప్పటి నుంచి క్షేత్ర పాలకుడిగా  శ్రీరాముడు వ్యవహరిస్తుండడంతో ఏటా ఇక్కడ శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. దీనిలో భాగంగా మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు రత్నగిరి రామాలయంలో సీతారాములను వధూవరులను చేసే కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహిస్తారు. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు శ్రీసత్యదేవుడు, అమ్మవారు పెళ్లి పెద్దలుగా వ్యవహరించడం విశేషం.
 
శ్రీరామ నవమి వేడుకల షెడ్యూల్‌..
∙ఏప్రిల్‌ 4న ఉదయం 6 గంటల నుంచి శ్రీరామునికి పట్టాభిషేకం. 
  సాయంత్రం నాలుగు గంటలకు సీతారాములను వధూవరులను చేస్తారు.
∙ఏప్రిల్‌ 5న ఉదయం పది గంటల నుంచి సీతారాముల కల్యాణం
∙ఏప్రిల్‌ 6న సీతారాములకు ఆస్థానసేవ.
∙ఏప్రిల్‌ 7న సాయంత్రం నాలుగు గంటలకు సీతారాముల వారి 
   ఆలయంలో పండిత సదస్యం 
∙ఏప్రిల్‌ 8, 9 తేదీల్లో సీతారాములకు ప్రత్యేక ఆస్థానసేవలు 
∙ఏప్రిల్‌ 10న సాయంత్రం 4 గంటలకు సీతారాముల వనవిహారోత్సవం
∙ఏప్రిల్‌ 11న ఉదయం చక్రస్నానం, సాయంత్రం నాకబలి, దండియాడింపు
∙ఏప్రిల్‌ 12న రాత్రి 8 గంటలకు సీతారాములకు శ్రీపుష్పయాగమహోత్సవం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement