వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రావణసందడి మొదలైంది. శ్రావణ మాసంలో శివాలయాల సందర్శనను భక్తులు శుభప్రదంగా భావిస్తారు. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో రాజన్న ఆలయ ఆవరణంతా కిక్కిరిసిపోయింది.
రాజన్న సన్నిధిలో శ్రావణ సందడి
Aug 7 2016 11:30 PM | Updated on Sep 4 2017 8:17 AM
వేములవాడ : వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రావణసందడి మొదలైంది. శ్రావణ మాసంలో శివాలయాల సందర్శనను భక్తులు శుభప్రదంగా భావిస్తారు. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో రాజన్న ఆలయ ఆవరణంతా కిక్కిరిసిపోయింది. రద్దీతో అధికారులు ఆర్జిత సేవలు రద్దు చేసి లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. దీంతో కొందరు భక్తులు అసహనం వ్యక్తంచేశారు. భక్తులు ధర్మగుండంలో పుణ్య స్నానాలాచరించి కోడె మొక్కులు చెల్లించుకునానరు. బాలత్రిపుర సుందరీ ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈవో దూస రాజేశ్వర్, ఏఈవోలు ఉమారాణి, గౌరీనాథ్, దేవేందర్, హరికిషన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వీఐపీల దర్శనాలను పీఆర్‌వో చంద్రశేఖర్, ఇన్‌స్పెక్టర్లు పర్యవేక్షించారు.
Advertisement
Advertisement