స్థల వివాదంలో ఆరోపణలు నిరాధారం | Speculative land claims dispute | Sakshi
Sakshi News home page

స్థల వివాదంలో ఆరోపణలు నిరాధారం

May 20 2016 3:46 AM | Updated on Sep 4 2017 12:27 AM

స్థల వివాదంలో ఆరోపణలు నిరాధారం

స్థల వివాదంలో ఆరోపణలు నిరాధారం

న్యాయవాది రవికుమార్‌కు చెందిన స్థల వివాదంలో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా నిరాధారమైన ఆరోపణలు చేసి తన ప్రతిష్టకుభంగం కలిగించారని

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: ఎంపీ తోట నరసింహం
కాకినాడ: న్యాయవాది రవికుమార్‌కు చెందిన స్థల వివాదంలో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా నిరాధారమైన ఆరోపణలు చేసి తన ప్రతిష్టకుభంగం కలిగించారని కాకినాడ ఎంపీ తోట నరసింహం ఆవేదనవ్యక్తం చేశారు. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలన్నంత మానసిక ఒత్తిడికి లోనయ్యానని కన్నీటి పర్యంతమయ్యారు. న్యాయవాది రవికుమార్ స్థల వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తోట నరసింహం గురువారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రవికుమార్ ఎవరో తనకు తెలియదని, ఇంతవరకూ ఆయనను చూడలేదని చెప్పారు.

తన పేరు చెప్పుకొని ఎవరైనా తప్పు చేసి ఉంటే తనను బాధ్యుడిని చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మీడియాలో వచ్చిన కథనాలు ఎంతో ఆవేదన కలిగించాయని అన్నారు. తాను అక్రమార్జన చేసినట్టు నిరూపిస్తే కాకినాడ నడిబొడ్డున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ విసిరారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన పత్రికలు, చానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. ఆరోపణలు వచ్చిన రోజు ఆత్మహత్య చేసుకుని, తన మరణాన్ని మీడియాకు అంకితమిద్దామనుకున్నానని, అరుుతే అలాంటి పని సరికాదని తమాయించుకున్నానని చెప్పారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement