క్రీడలతోనే జాతీయ సమైక్యాభివృద్ధి | spectra -16 festival in nanayya university | Sakshi
Sakshi News home page

క్రీడలతోనే జాతీయ సమైక్యాభివృద్ధి

Dec 16 2016 9:42 PM | Updated on Nov 9 2018 6:16 PM

క్రీడల వల్ల జాతీయ సమైక్యతాభావం వృద్ధి చెందుతుందని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. క్రీడాకారులకు దేశ భక్తి ఉంటేనే తాను దేశం కోసం ఆడుతున్నానన్న భావనతో ఆడతారన్నారు. స్థానిక గైట్‌ పాలిటెక్నిక్‌

  • గైట్‌లో ప్రారంభమైన స్పెక్ట్రా – 16
  • వెలుగుబంద (రాజానగరం) :
    క్రీడల వల్ల జాతీయ సమైక్యతాభావం వృద్ధి చెందుతుందని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. క్రీడాకారులకు దేశ భక్తి ఉంటేనే తాను దేశం కోసం ఆడుతున్నానన్న భావనతో ఆడతారన్నారు. స్థానిక గైట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో సాంకేతిక, క్రీడా, సాంస్కృతిక ఉత్సవం ‘స్పెక్ట్రా–16’ ఉత్సవాలను జ్యోతిప్రజ్వలన చేసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. ప్రతి విద్యార్థి మంచి క్రీడాకారుడిగా భారతదేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలన్నారు. అందుకు తల్లిదండ్రులు కూడా చొరవచూపాలన్నారు.  విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు వేదిక అవుతాయని విశిష్ట అతిథిగా పాల్గొన్న ఏపీ సాంకేతిక విద్య శిక్షణ బోర్డు ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు బీకే సూర్యప్రకాష్‌  అన్నారు. విద్యా బోధనలో జీవననైపుణ్యాలు కూడా భాగమేనన్నారు.  అనంతరం స్పెక్ట్రా–16 క్రీడోత్సవాన్ని, పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద ఏర్పాటుచేసిన స్టాల్స్‌ని ఆయన ప్రారంభించారు. పాలిటెక్నిక్‌ విద్యార్థుల కోసం తొలిసారిగా ఈ సంవత్సరం నుంచి ఉత్సవం నిర్వహిస్తున్నామని కళాశాల ఎండీ కె. శశికిరణ్‌వర్మ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అనూహ్యమైన స్పందన వచ్చిందన్నారు.  ఏటా డిసెంబరులో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు.
    విజేతలకు బహుమతి ప్రదానం
    పోటీల్లో విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. 800 మీటర్ల పరుగు పందెంలో ద్రాక్షారామ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థి టి. వెంకటేష్‌ ప్రధమ బహుమతిని, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు వి.సుధీర్‌కుమార్, హెచ్‌.లక్ష్మీపతి ద్వితీయ, తృతీయ బహుమతులను కైవసం చేసుకున్నారు. కళాశాల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కె. లక్ష్మిశశికిరణ్, సీఈఓ డాక్టర్‌ డీఎల్‌ఎ¯ŒS రాజు, ప్రిన్సిపాళ్లు డాక్టర్‌ డీవీ రామ్మూర్తి, డాక్టర్‌ ఎస్‌.శ్రీనివాçసన్, డైరెక్టర్లు డాక్టర్‌ ఎల్‌ఎస్‌ గుప్త, కె. ఆనందరావు, డీ¯ŒS డాక్టర్‌ ఎం. వరప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement