రూ.5వేలతో వీఐపీలకు రాహుకేతు పూజలు | Special Rahuketu pooja tickets for VIPS | Sakshi
Sakshi News home page

రూ.5వేలతో వీఐపీలకు రాహుకేతు పూజలు

Sep 12 2016 12:38 AM | Updated on Sep 4 2017 1:06 PM

శ్రీకాళహస్తి ఆలయంలో సినీ దర్శకుడు కోదండరామిరెడ్డికి రాహుకేతు పూజల టికెట్టు అందజేస్తున్న చైర్మన్‌ పోతుగుంట గురవయ్యనాయుడు

శ్రీకాళహస్తి ఆలయంలో సినీ దర్శకుడు కోదండరామిరెడ్డికి రాహుకేతు పూజల టికెట్టు అందజేస్తున్న చైర్మన్‌ పోతుగుంట గురవయ్యనాయుడు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానంలో రూ.5వేలు టిక్కెట్‌ ద్వారా వీఐపీలు రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకోవడానికి అవకాశం కల్పిస్తూ నూతన కౌంటర్‌ను ప్రారంభించారు.

– శ్రీకాళహస్తిలో ఆదివారం ప్రారంభం
– తొలి టికెట్‌ కొనుగోలు చేసిన సినీదర్శకుడు కోదండరామిరెడ్డి
శ్రీకాళహస్తిః
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానంలో రూ.5వేలు టిక్కెట్‌ ద్వారా వీఐపీలు రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకోవడానికి అవకాశం కల్పిస్తూ నూతన కౌంటర్‌ను ప్రారంభించారు. శ్రీకాళహస్తి ఆలయంలో ఇప్పటివరకు రూ.300 టిక్కెట్‌ ద్వారా (శ్రీకృష్ణదేవరాయల మండపంలో), రూ.750 టికెట్‌ ద్వారా (బాలజ్ఞానాంబిక మండపంలో), రూ.1,500 టికెట్‌ ద్వారా (పాత ప్రసాదాల మండపంలో), రూ.2,500 టిక్కెట్‌ ద్వారా (మృత్యుంజయ మండపంలో) నాలుగు రకాలుగా రాహుకేతు పూజలు చేయించుకుంటున్న విషయం తెలిసిందే. కాగా ఐదో రకం టికెట్‌గా రూ.5వేలు నిర్ణయించారు. ఈ టిక్కెట్‌ కొన్నవారు స్వామివారి సన్నిధిలోని సహస్రలింగేశ్వరస్వామి మండపంలో రాహుకేతు సర్పదోష పూజలు చేసుకునే అవకాశాన్ని ఆదివారం నుంచి కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆలయ ఆవరణంలో ఓ కౌంటర్‌ను ఏర్పాటుచేశారు. కాగా తొలి టిక్కెట్‌ సినీ దర్శకుడు కోదండరామిరెడ్డి కొనుగోలు చేసుకుని కుటుంబసభ్యులతో సహస్రలింగేశ్వరస్వామి మండపంలో పూజలు చేయించుకున్నారు. రెండో టికెట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఓఎస్‌డీ సాయిప్రసాద్‌ కుటుంబ సభ్యులు, మూడో టెక్కెట్‌ కోదండరామిరెడ్డి కుమారుడు సినీనటుడు వైభవ్‌ కొనుగోలు చేసి కుటుంబసభ్యులతో రాహుకేతు పూజలు చేయించుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement