‘యాదాద్రి’లో ప్రత్యేక పూజలు | special puja in yadadri | Sakshi
Sakshi News home page

‘యాదాద్రి’లో ప్రత్యేక పూజలు

Aug 20 2016 6:41 PM | Updated on Sep 4 2017 10:06 AM

‘యాదాద్రి’లో ప్రత్యేక పూజలు

‘యాదాద్రి’లో ప్రత్యేక పూజలు

యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలను నిర్వహించారు.

యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ఉదయం పంచామృతాలతో తిరుమంజన ఉత్సవం జరిపారు. గులాబి, మందారం, కనకాంబరం తదితర పూలమాలలతో స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. భక్తులు ఉదయం నుంచి విష్ణు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. నిత్య కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకుడు నల్లందీగళ్‌ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు, అర్చకులు సురేంద్రాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, ఆలయ అధికారులు చంద్రశేఖర్, గోపాల్‌ పాల్గొన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement