తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేటలో నివసించే ఓ యువకుడు మద్యం సేవించి ఆ మత్తులో అత్తను, భార్యను హింసించడంతో..
♦ మద్యం మత్తులో అసభ్యంగా
♦ ప్రవర్తిస్తూ వేధింపులు
నులకపేట (తాడేపల్లి రూరల్) : తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేటలో నివసించే ఓ యువకుడు మద్యం సేవించి ఆ మత్తులో అత్తను, భార్యను హింసించడంతో బుధవారం తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో అత్త ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తాడేపల్లి ఎస్సై ప్రతాప్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నులకపేటలో నివాసం ఉండే ఓ మహిళ తన పెద్ద కూతురును ఆరేళ్ల క్రితం రామవరప్పాడుకు చెందిన కరుడు నరేష్‌కి ఇచ్చి వివాహం చేసింది. తాగుడుకు బానిసైన నరేష్ భార్యను పోషించకుండా పుట్టింటికి పంపించివేశాడు.
అనంతరం నరేష్ కూడా వచ్చి అత్త గారి ఇంట్లోనే నివాసం ఉంటూ ప్రతిరోజూ మద్యం సేవించి అత్తతో, భార్యతో ఒకే విధంగా ప్రవర్తిస్తూ హింసిస్తున్నాడు. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు కూడా చర్చించుకొని నరేష్‌కు సర్దిచెప్పినా అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేకుండా, అత్తతో, ఆమె కూతురుతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, హింసిస్తుండటంతో విసిగిపోయిన అత్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రతాప్‌కుమార్ తెలిపారు.