పాత కేసులను పరిష్కరించాలి | solve old cases | Sakshi
Sakshi News home page

పాత కేసులను పరిష్కరించాలి

Sep 15 2016 12:45 AM | Updated on Sep 4 2017 1:29 PM

పాత కేసులను పరిష్కరించి కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షుడు జస్టీస్‌ నౌషద్‌ అలీ ఆదేశించారు.

 రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షుడు జస్టిస్‌ నౌషద్‌ అలీ  
 
కర్నూలు(లీగల్‌): పాత కేసులను పరిష్కరించి కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షుడు జస్టీస్‌ నౌషద్‌ అలీ ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా వినియోగదారుల ఫోరంను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసుల వివరాలు, వాటి పెండింగ్‌ కాల పరిమితిని అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో జిల్లా వినియోగదారుల ఫోరం ఇన్‌చార్జి అధ్యక్షురాలు ఎస్‌.నజీరున్నిసా పాల్గొన్నారు. కర్నూలులో రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ను ఏర్పాటు చేయాలని జిల్లాలోని వినియోగదారుల సంఘాల నాయకులు, కక్షిదారులు ఆయన విజ్ఞానపత్రం ఇచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement