రాయవేలురు టీఎంసీ నుంచి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దినేష్ రెడ్డి డిశ్చార్జ్ అయ్యారు.
చిత్తూరు: రాయవేలురు టీఎంసీ నుంచి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దినేష్ రెడ్డి డిశ్చార్జ్ అయ్యారు. చిత్తూరులోని పెనుమూరు క్రాస్ రోడ్డు వద్ద మురుగా రెడ్డి ఆయన కుమారుడు దినేష్ పై ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దినేష్ ఛాతిలోకి బుల్లెట్లు దూసుకుపోవడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు.
నిందితులను చూసిన దుకాణదారుడిని పోలీసులు విచారిస్తున్నారు. మంగళవారం నిందితుల ఊహాచిత్రాలను పోలీసులు విడుదల చేయనున్నారు.