
ప్రసూతి వార్డులో పాము!
విశాఖ జిల్లా సబ్బవరం మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రంలోకి భారీ పాము చొరబడింది.
పెందుర్తి/సబ్బవరం: విశాఖ జిల్లా సబ్బవరం మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రంలోకి భారీ పాము చొరబడింది. ఆదివారం ఉదయం వైద్యుడు రమేష్ సహా కిందిస్థాయి సిబ్బంది విధులకు హాజరయ్యేందుకు ఆసుపత్రికి వచ్చారు. ఇదే సమయంలో కాన్పు కోసం ఓ మహిళ వచ్చింది. అయితే కేసు ఇబ్బందికరంగా ఉండడంతో ఆ మహిళను కేజీహెచ్‌కు పంపేశారు. అనంతరం గదులను శుభ్రపరిచేందుకు స్వీపర్లు సిద్ధమవుతుండగా ప్రసూతి వార్డులోని ఓ మంచం కింద పాము ఉండడాన్ని గమనించి పరుగులు తీశారు.
స్థానికులు దానిని హతమార్చారు. ఇది ప్రమాదకరమైన పొడపాము జాతికి చెందినదని, ఇది కాటేస్తే మనిషి బతకడం కష్టమని, బతికినా జీవితాంతం మందులు వాడాల్సిందేనని స్థానికులు తెలిపారు.