ఉత్సాహంగా షటిల్‌ పోటీలు | shuttle tournment | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా షటిల్‌ పోటీలు

Jul 30 2016 12:11 AM | Updated on Sep 4 2017 6:57 AM

ఉత్సాహంగా షటిల్‌ పోటీలు

ఉత్సాహంగా షటిల్‌ పోటీలు

జిల్లా బ్యాడ్మింటన్‌ ఆసోసియేషన్‌ ఆధ్వర్యంలో పటమట ఫన్‌టైమ్స్‌ క్లబ్‌లో శుక్రవారం జిల్లా షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ప్రారంభమైంది. చిన్నారి క్రీడాకారులు ఉత్సాహంగా పోటీల్లో సత్తా చాటుకున్నారు.

ఫన్‌టైమ్స్‌ క్లబ్‌లో ప్రారంభం
విజయవాడ స్పోర్ట్స్‌ : 
జిల్లా బ్యాడ్మింటన్‌ ఆసోసియేషన్‌ ఆధ్వర్యంలో పటమట ఫన్‌టైమ్స్‌ క్లబ్‌లో శుక్రవారం జిల్లా షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ప్రారంభమైంది. చిన్నారి క్రీడాకారులు ఉత్సాహంగా పోటీల్లో సత్తా చాటుకున్నారు.  టోర్నీని నగర మేయర్‌ కోనేరు శ్రీధర్‌ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బ్యాడ్మింటన్‌లో విజయవాడ నుంచి ఎంతో మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించారన్నారు. మూడురోజుల పాటు ఈ పోటీలను నిర్వహిస్తున్న ఫన్‌టైమ్స్‌ క్లబ్‌ను ఆయన అభినంధించారు. బ్యాడ్మింటన్‌ ఆసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా కార్యదర్శి కేసీహెచ్‌ పున్నయ్య చౌదరి, సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ అంకమ్మ చౌదరి, వై.రమేష్‌బాబు,  జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అ««దl్యక్ష,కార్యదర్శులు ఆర్‌.రామ్మోహనరావు, డాక్టర్‌ ఇ.త్రిమూర్తి, ఫన్‌టైమ్స్‌ క్లబ్‌ కార్యదర్శి వి.సాంబశివరావు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి వి.రాధాకృష్ణ ,  స్థానిక కార్పొరేటర్‌ జాస్తి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. 
తొలి రోజు ఫలితాలు:
బాలుర అండర్‌–13 విభాగంలో టి.రాహుల్‌ (కేకేఆర్‌గౌతమ్‌) 30–12 తేడాతో జె.ఇషాన్‌ ((డీఆర్‌ఎంసీ)పై, టి.హర్షన్‌ (వీపీఎస్‌) 30–12 తేడాతో అమనకుమార్‌ (కేకేఆర్‌ గౌతమ్‌)పై, సుభం కుమార్‌ (కే కేఆర్‌ గౌతమ్‌) 30–13 తేడాతో బీఎస్‌ఎస్‌ కార్తీక్‌ (ఫన్‌టైమ్స్‌), వీవీ సాయి (ఫన్‌టైమ్స్‌) 30–4 తేడాతో ఎండీ మున్వర్‌ (కేకేఆర్‌ గౌతమ్‌)పై, వి,అన్షుల్‌ (ఫన్‌టైమ్స్‌) 30–10 తేడాతో వై.శ్రీవంత్‌ (కేసీపీ సిద్ధార్థ)పై, టి.ప్రణవ్‌ (రవీం’ధ్రభారతీ) 30–10 తేడాతో ఎల్‌.రోహిత్‌ (ఫన్‌టైమ్స్‌)పై గెలుపొందారు. 
అండర్‌–13 బాలికల విభాగంలో కె.రిషిక (వీపీఎస్‌) 30–4 తేడాతో వి.మిషా్వని (విజయవాడ)పై, డి.రష్మిత (వీపీ సిద్ధార్థ) 30–5 తేడాతో బి.లలితలాస్య (విజయవాడ)పై గెలుపొందారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement