ముమ్మరంగా బోరుగుంతల పూడ్చివేత | Serbs, youth, and officers are in the villages of the village to bore borebars | Sakshi
Sakshi News home page

ముమ్మరంగా బోరుగుంతల పూడ్చివేత

Jun 28 2017 4:54 AM | Updated on Sep 5 2017 2:36 PM

ముమ్మరంగా బోరుగుంతల పూడ్చివేత

ముమ్మరంగా బోరుగుంతల పూడ్చివేత

బోరుబావులను పూడ్చేందుకు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, యువత, అధికారులు ముందుకు వçస్తున్నారు.

మెదక్‌రూరల్‌: బోరుబావులను పూడ్చేందుకు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, యువత, అధికారులు ముందుకు వçస్తున్నారు.  మెదక్‌ మండలం మంబోజిపల్లి గ్రామ సమీప పొలంలో ప్రమాదకరంగా ఉన్న బోరుబావిని సర్పంచ్‌ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో పూడ్చివేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ బోర్‌ వేసిని నీరుపడని గుంతలను వెంటనే పూడ్చివేయాలని సూచించారు.   

పాపన్నపేట(మెదక్‌): మండల పరిధిలోని చిత్రియాల్‌లో నిరుపయోగంగా ఉన్న బోరు గుంతలను ఎస్‌ఐ సందీప్‌రెడ్డి ,గ్రామ పోలీసు ఇన్‌చార్జి ఇమ్మానియల్‌ ఆధ్వర్యంలో పోలీసులు పూడ్చివేశారు. బోరు తవ్వినా నీరు పడకపోవడంతో చాలా మంది రైతులు వాటిని అలాగే వదిలేశారు. ఈ సంధర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. ప్రమాదకరంగా ఉన్న బోర్లను రైతులు వెంటనే పూడ్చివేత చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. లేనిపక్షంలో కేసులు నమోదుచేస్తామన్నారు.  

హవేళిఘణాపూర్‌(మెదక్‌): ప్రమాదకరంగాఉన్న బోరుబావులను పూడ్చివేయాలని హవేళిఘణాపూర్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా మంగళవారం ఎస్‌ఐ ఆధ్వర్యంలో మండల పరిధిలోని తొగిట, కూచన్‌పల్లి, ముత్తాయికోట, మద్దుల్‌వాయి గ్రామాల్లో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. నీరు పడని బోరుబావుల పూడ్చివేత చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు. అంతకు ముందు హవేళిఘణాపూర్‌ ఉన్నత పాఠశాలలో ప్రమాదకరంగా ఉన్న బోరుబావిని పూడ్చివేశారు. బైక్‌ ర్యాలీలో ఎంపీటీసీ శ్రీకాంత్, టీఆర్‌ఎస్‌ నాయకులు సాయిలు, రాంచంద్రారెడ్డి, మంగ్యనాయక్, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

పెద్దశంకరంపేట(మెదక్‌): బోరుబావుల మూసివేతపై ప్రతిఒక్కరూ స్పందించాలని ఎస్‌ఐ విజయరావు, సర్పంచ్‌ జంగం శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేట బస్టాండ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోఉన్న ప్రమాదకరంగా ఉన్న బోరుబావులను మట్టితో పూడ్చివేశారు. ప్రజల స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బోరుబావులను పూడ్చివేయాలని కోరారు.  కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు సుభాష్‌గౌడ్, ఈఓ నవీన్‌కుమార్, పోలీస్‌ సిబ్బంది తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement