8న సీనియర్‌ హాకీ క్రీడాకారుల ఎంపిక పోటీలు | senior hockey selections on 8th | Sakshi
Sakshi News home page

8న సీనియర్‌ హాకీ క్రీడాకారుల ఎంపిక పోటీలు

Jan 6 2017 12:16 AM | Updated on Sep 5 2017 12:30 AM

ఈ నెల 8 వ తేదీన జిల్లా హాకీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నంద్యాలలోని స్థానిక ఎస్పీజీ హైస్కూలు మైదానంలో సీనియర్‌ హాకీ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్‌ కార్యదర్శి డి. సుధీర్‌ గురువారం ప్రకటనలో తెలిపారు.

కర్నూలు (టౌన్‌): ఈ నెల 8 వ తేదీన జిల్లా హాకీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నంద్యాలలోని స్థానిక ఎస్పీజీ హైస్కూలు మైదానంలో సీనియర్‌ హాకీ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్‌ కార్యదర్శి డి. సుధీర్‌ గురువారం ప్రకటనలో తెలిపారు. 16 సంవత్సరాలు దాటి, ఆసక్తి కలిగిన క్రీడకారులు రూ. 10 ప్రవేశ రుసుంతో ఈ పోటీలలో పాల్గొనవచ్చని తెలిపారు. ఎంపికైన జిల్లా హాకీ సీనియర్‌ జట్టు ఈనెల 26 నుంచి 29 వరకు విశాఖపట్నంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి అంతర్‌ జిల్లాల హాకీ పోటీలలో పాల్గొంటారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement