కల్లూరుకు చేరిన పర్యావరణ రైలు | Sakshi
Sakshi News home page

కల్లూరుకు చేరిన పర్యావరణ రైలు

Published Sat, Jun 3 2017 8:14 PM

sciene rail at pamidi

పామిడి : పర్యావరణ అంశాలతో కూడిన ఎగ్జిబిషన్‌ ట్రైన్‌ గుల్బర్గా నుంచి శనివారం ఉదయం 9 గంటలకు గార్లదిన్నె మండలం కల్లూరు రైల్వేస్టేషన్‌కు చేరింది. ఈ సందర్భంగా 10 గంటలకు గుంతకల్‌ అడిషనల్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ సుబ్బరాయుడు రిబ్బన్‌ కట్‌చేసి ట్రైన్‌ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. రైల్వే ఫ్యాకల్టీలు ట్రైన్‌లోని పర్యావరణ అంశాలతో కూడిన సైన్స్‌ ఎగ్జిబిషన్‌పై అవగాహన కల్పించారు. వాతావరణంలోని మార్పులు, వాతావరణ కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై వారు డెమో ఇచ్చారు. రెండురోజులపాటు కల్లూరులో ఈ ట్రైన్‌ ఎగ్జిబిషన్‌ ఉంటుందని స్టేషన్‌ మాస్టర్‌ రాజేంద్రనాయుడు తెలిపారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement