లైంగికదాడి కేసులో సర్పంచ్‌ భర్త అరెస్టు | Sarpanch husband was arrested in a sexual assault case | Sakshi
Sakshi News home page

లైంగికదాడి కేసులో సర్పంచ్‌ భర్త అరెస్టు

Jan 6 2017 10:24 PM | Updated on Aug 11 2018 8:16 PM

లైంగిక దాడి కేసులో సర్పంచ్‌ భర్తను గురువారం అరెస్టు చేసినట్లు సీఐ సురేందర్‌ తెలిపారు.

ఇబ్రహీంపట్నం: లైంగిక దాడి కేసులో సర్పంచ్‌ భర్తను గురువారం అరెస్టు చేసినట్లు సీఐ సురేందర్‌ తెలిపారు. ఆయన కథనం.. మండలంలోని వేములకుర్తిలో ఈ నెల ఒకటో తేదీ రాత్రి వేములకుర్తి సర్పంచ్‌ భర్త సున్నం సత్యం అదే గ్రామానికి చెందిన బాలికపై లైంగికదాడికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం సున్నం సత్యంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement