ఎన్నికల కోసం చేసిన అప్పులు తీర్చలేక సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలం బూర్గుపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది.
కోయిల్‌కొండ (మహబూబ్‌నగర్) : ఎన్నికల కోసం చేసిన అప్పులు తీర్చలేక సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలం బూర్గుపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ దేవమ్మ(60) సర్పంచ్ ఎన్నికల కోసం భారీగా ఖర్చు చేసింది. తన వద్ద నగదు లేకపోవడంతో.. అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టింది.
ఎట్టకేలకు తాను అనుకున్న పదవిని దక్కించుకోగలిగింది కానీ.. డబ్బును మాత్రం పోగొట్టుకుంది. గత కొన్ని రోజులుగా అప్పులు తీర్చాలని అప్పులవాళ్లు వేధిస్తుండటంతో.. మనస్తాపానికి గురై మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.