నేడు, రేపు సాక్షి మెగా ఆటో షో | sakshi mega auto show | Sakshi
Sakshi News home page

నేడు, రేపు సాక్షి మెగా ఆటో షో

Nov 5 2016 2:09 AM | Updated on Sep 4 2017 7:11 PM

సాక్షి, రాజమహేంద్రవరం : వాహన కొనుగోలుదారులు, ప్రముఖ ఆటో కంపెనీల ఆసక్తి మేరకు ‘సాక్షి’ మెగా ఆటో షో శని, ఆదివారాల్లో రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రెండు రోజులపాటు జరగనున్న ఈ మెగా ఆటో షోను వాహన ప్రియులు సందర్శించవచ్చని నిర్వాహకులు తెలిపారు.

సాక్షి, రాజమహేంద్రవరం : వాహన కొనుగోలుదారులు, ప్రముఖ ఆటో కంపెనీల ఆసక్తి మేరకు ‘సాక్షి’ మెగా ఆటో షో శని, ఆదివారాల్లో రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రెండు రోజులపాటు జరగనున్న ఈ మెగా ఆటో షోను వాహన ప్రియులు సందర్శించవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్, నగరపాలక సంస్థ మేయర్‌ పంతం రజనీశేషసాయి పాల్గొంటారు. యమహా సిరి మోటార్స్, శ్రీ సిరి ఆటోమొబైల్స్, ఎస్బీ మోటార్స్, ట్రైస్టార్‌ ఫోర్డ్, కంటిపూడి నిస్సాన్, కంటిపూడి డాట్సన్, కంటిపూటి సుజుకి, రెడ్డి బాబు హీరో, సీపీ రెడ్డి హీరో, శ్రీఆర్‌కే హోండా, టర్బో ఫియట్, చవర్లెట్‌ ఆరెంజ్‌ ఆటోమెబైల్స్, టాటా శ్రీ కోడూరి ఆటోమొబైల్స్, లీలాకృష్ణ టయోట, రేనాల్ట్‌ విశ్వరూప ఆటోమోటివ్స్, ఎలైట్‌ హోండా, లక్ష్మి హూండాయ్, గోకుల్‌ టీవీఎస్‌ టూ వీలర్, కోడూరి పియోజియో త్రీవీలర్‌ ఆటో, మహీంద్ర ఎంఅండ్‌ఎం మోటార్స్, దాక్షాయిని టీవీఎస్‌ వంటి ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలన్నింటినీ ఒకే వేదికపైకి ’సాక్షి’ తీసుకువస్తోంది. వందలాది సరికొత్త, ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన వాహనాలు ఈ మెగా ఆటో ఎక్స్‌పోలో కొలువుదీరనున్నాయి. నచ్చేకలర్‌ ఒకచోట, మోడల్‌ మరోచోట, ఫైనా¯Œ్స ఇంకోచోట ఇలా వాహనం కొనేంతవరకు వినియోగదారుల అన్వేషణ జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ శ్రమ అవసరం లేకుండా అన్నీ ఒకే వేదికపై ఈ మెగా షోలో లభించనున్నాయి. అన్నిరకాల వాహనాలను స్టాల్స్‌లో ప్రదర్శించడంతోపాటు వాటి ప్రత్యేకతలను నిపుణులు వివరిస్తారు. ఫలితంగా వినియోగదారులకు సమయం వృథా కాకుండా ఉంటుంది. పత్రికలు, టీవీల్లో ఇచ్చే వాహనాల సమాచారం కన్నా మరింత ఎక్కువగా పొందడమే కాకుండా, వాహనాన్ని నేరుగా పరిశీలించే వెసులుబాటు లభిస్తుంది. 
 
రుణ సదుపాయం
నచ్చిన వాహనాన్ని వెంటనే వినియోగదారుడు సొంతం చేసుకోవచ్చు. బ్యాంకర్ల ద్వారా సులభతరమైన వాయిదా పద్ధతులు, తక్షణ రుణ సదుపాయాన్ని (స్పాట్‌ ఫైనా¯Œ్స) పొందవచ్చు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ సదుపాయాలు అందిస్తోంది. 
 
యమహా ఫ్యాసినో సొంతం చేసుకోండి
’సాక్షి’ మెగా ఆటో షోలో వాహనం బుక్‌ చేసుకున్నవారికి బంపర్‌ ఆఫర్‌ డ్రాలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. సిరి మోటార్స్‌ సౌజన్యంతో బంపర్‌ డ్రాలో యమహా ఫ్యాసినో  బహుమతిగా గెలుసుకోవచ్చు. యమహా స్కూటర్‌ కొనుగోలు చేసిన మొదటి 10 మందికి ఉచితంగా యాక్ససరీస్‌ అందజేస్తారు. 
ప్రతి గంటకు గిఫ్ట్‌ కూప¯ŒS 
ఆటో షోలో వాహన ప్రియులు కుటుంబ సమేతంగా పాల్గొని, ఈ సువర్ణవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. చందన రమేష్‌ గ్రూప్‌వారి సౌజన్యంతో సందర్శకులకు గంట గంటకు ఉచిత గిఫ్ట్‌ కూప¯ŒS ఇవ్వనున్నారు. 93.5 రెడ్‌ ఎఫ్‌ఎం రేడియో, సాక్షి, టీవీ న్యూస్‌ చానల్‌ పార్టనర్‌గా వ్యవహరిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement