మహానందికి పుష్కర భక్తుల రద్దీ | rush at mahanandi | Sakshi
Sakshi News home page

మహానందికి పుష్కర భక్తుల రద్దీ

Aug 23 2016 12:31 AM | Updated on Sep 4 2017 10:24 AM

మహానందికి పుష్కర భక్తుల రద్దీ

మహానందికి పుష్కర భక్తుల రద్దీ

మహానంది క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. పుష్కరాల సందర్భంగా శ్రీశైలం, సంగమేశ్వరం వచ్చిన భక్తులు మహానంది క్షేత్రాన్ని దర్శించుకుంటున్నారు.

మహానంది: మహానంది క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. పుష్కరాల సందర్భంగా శ్రీశైలం, సంగమేశ్వరం వచ్చిన భక్తులు మహానంది క్షేత్రాన్ని దర్శించుకుంటున్నారు. ఈ మేరకు సోమవారం వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకోవడంతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి. కృష్ణ పుష్కరాలతో పాటు ఉరుకుంద ఈరన్న స్వామి ఉత్సవాలు, మంత్రాలయం రాఘవేంద్రుడి ఉత్సవాలు అన్నీ కలిసి రావడంతో మహానంది క్షేత్రం గత కొద్దిరోజులుగా భక్తులతో కిక్కిరిసిపోతుంది. అలాగే శ్రావణ మాసం శుభముహూర్తాలు ఉండటంతో ఆలయ ప్రాంగణంలో వివాహాలు కూడా జరగడంతో ఆలయం కిటకిటలాడుతోంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement