రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేటు, వర్సిటీ ప్రాంగణంలోని కళాశాల పీజీ కోర్సుల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును పొడిగించినట్లు పీజీ సెట్ కన్వీనర్ సి.వి.కృష్ణారెడ్డి శనివారం తెలిపారు.
ఆర్‌యూ పీజీ సెట్ గడువు పొడిగింపు
Apr 22 2017 11:29 PM | Updated on Aug 20 2018 3:09 PM
కర్నూలు(ఆర్‌యూ) : రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేటు, వర్సిటీ ప్రాంగణంలోని కళాశాల పీజీ కోర్సుల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును పొడిగించినట్లు పీజీ సెట్ కన్వీనర్ సి.వి.కృష్ణారెడ్డి శనివారం తెలిపారు. ఈనెల 24వ తేదీ వరకు ఉన్న గడువును 30వ తేదీ వరకు పొడిగించారు. రూ.వెయ్యి అపరాధ రుసుముతో మే నెల 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లో షెడ్యూల్ ప్రకారమే అంటే మే నెల 24, 25, 26 తేదీల్లో నంద్యాల, ఆదోని, కర్నూలు కేంద్రాలుగా నిర్వహిస్తామని తెలిపారు.
Advertisement
Advertisement