ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కం ఇంటర్ సర్కిల్ వాలీబాల్ టోర్నమెంట్‌లో ఆర్టీపీపీ జట్టు ఫైనల్‌కు చేరింది. శనివారం వైజాగ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గెలిచి తమ జట్టు ఫైనల్‌కు అర్హత సాధించిందని స్పోర్ట్సు సెక్రటరీ ఖాదర్‌బాషా తెలిపారు.
వాలీబాల్ ఫైనల్‌కు చేరుకున్న ఆర్టీపీపీ
Dec 10 2016 10:57 PM | Updated on Sep 4 2017 10:23 PM
ఎర్రగుంట్ల: ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కం ఇంటర్ సర్కిల్ వాలీబాల్ టోర్నమెంట్‌లో ఆర్టీపీపీ జట్టు ఫైనల్‌కు చేరింది. శనివారం వైజాగ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గెలిచి తమ జట్టు ఫైనల్‌కు అర్హత సాధించిందని స్పోర్ట్సు సెక్రటరీ ఖాదర్‌బాషా తెలిపారు. ఈ టోర్నమెంట్ వైజాగ్‌లో ఈ నెల 7వ తేది నుంచి 11 వరకు జరగనున్నాయి. వైజాగ్‌లో ఆదివారం జరిగే ఫైనల్‌మ్యాచ్లో వీటీపీఎస్ జట్టుతో ఆర్టీపీపీ తలపడనుంది. ఈ జట్టులో రాంప్రసాద్, రామక్రిష్ణ, మణిపాల్, ఏసురత్నం, రవి ఉన్నారు.
Advertisement
Advertisement