కొత్త ఏడాది మరింత అభివృద్ధి | Rs. 300 Crores for city development | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాది మరింత అభివృద్ధి

Dec 31 2016 8:54 PM | Updated on Sep 5 2017 12:03 AM

కొత్త ఏడాది మరింత అభివృద్ధి

కొత్త ఏడాది మరింత అభివృద్ధి

కొత్త సంవత్సరంలో మరింతగా నగరాభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తామని మేయర్‌ కోనేరు శ్రీధర్‌ పేర్కొన్నారు. మేయర్‌ తన చాంబర్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు.

విజయవాడ సెంట్రల్‌ : కొత్త సంవత్సరంలో మరింతగా నగరాభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తామని మేయర్‌ కోనేరు శ్రీధర్‌ పేర్కొన్నారు. మేయర్‌ తన చాంబర్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు. గడిచిన రెండున్నర ఏళ్ల పాలనలో సుమారు రూ.300 కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది మరిన్ని కొత్త ప్రాజెక్ట్‌లను చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. నగరపాలక సంస్థ నూతన భవనం పనులను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతించినట్లు చెప్పారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణంపై దృష్టి పెట్టినట్ల తెలిపారు. కాల్వల సుందరీకరణ, రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ వల్ల రానున్న కాలంలో నగర రూపురేఖలు మారతాయన్నారు. కృష్ణా పుష్కరాల నిధులు రూ.186 కోట్లతో ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లను అభివృద్ధి చేశామని వివరించారు. డెప్యూటీ మేయర్‌ గోగుల వెంకట రమణారావు, ఫ్లోర్‌లీడర్‌ గుండారపు హరిబాబు, కార్పొరేటర్‌ హరనాథ్‌బాబు, మాజీ కార్పొరేటర్‌ కొట్టేటి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement