రిటైర్డ్‌ సర్వేయర్‌ ఆత్మహత్య | retired surveyor suicides | Sakshi
Sakshi News home page

రిటైర్డ్‌ సర్వేయర్‌ ఆత్మహత్య

Dec 25 2016 10:46 PM | Updated on Sep 4 2017 11:35 PM

యాడికిలో రిటైర్డ్‌ సర్వేయర్‌ పీటర్‌(70) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు.

యాడికి : యాడికిలో రిటైర్డ్‌ సర్వేయర్‌ పీటర్‌(70) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పీటర్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పని చేసి రిటైర్డ్‌ అయ్యారు. ఆయన భార్య పదేళ్ల కిందటే మృతి చెందారు. వారికి ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు ప్రైవేటు ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. చిన్న కొడుకు ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంలో ఉంటున్నాడు. తండ్రి రోజూ మద్యం తాగి రావడం నచ్చని పెద్ద కుమారుడు మరోచోట నివాసముంటున్నాడు.

దీంతో పీటర్‌ ఒక్కరే ఇంటిలో ఉండేవారు. భోజనం పెట్టేవారు కూడా లేకపోగా, క్రిస్మస్‌ పండుగ రోజూ ఆకలిని తట్టుకోలేకపోయిన ఆయన చివరకు ఇంట్లోనే మద్యం తాగి, ఆ తరువాత ఉరేసుకుని తనువు చాలించారన్నారు. సాయంత్రం పీటర్‌ కోసం ఇంటికొచ్చిన ఓ వ్యక్తి  గమనించి వెంటనే వారి బంధువులుకు సమాచారం అందించారని ఎస్‌ఐ తెలిపారు.  కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పీటర్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement