గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి | remand inmate died in rajahmundry central jail | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి

Jul 28 2016 11:07 AM | Updated on Sep 4 2017 6:46 AM

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న ఖైదీ గుండెపోటుతో మృతి చెందాడు.

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న ఖైదీ గుండెపోటుతో మృతి చెందాడు. ఆ విషయాన్ని గురువారం ఉదయం జైలు సిబ్బంది గుర్తించి పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. గంజాయి అక్రమ రవాణా కేసులో మూడు రోజుల కిందటే ఖైదీ సత్యనారాయణరెడ్డి (38) అరెస్ట్ చేసినట్లు జైళ్లు శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఖైదీ మృతిపై అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు అధికారులు వెల్లడించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement