నకిలీ వైద్యులకు రిమాండ్‌ | remand for fake doctors | Sakshi
Sakshi News home page

నకిలీ వైద్యులకు రిమాండ్‌

Jun 21 2017 9:00 PM | Updated on Sep 5 2017 2:08 PM

నకిలీ వైద్యులకు రిమాండ్‌

నకిలీ వైద్యులకు రిమాండ్‌

నకిలీ వైద్యులు నాగేంద్ర, ఆయన సమీప బంధువు జ్యోతిలను బుధవారం రిమాండ్‌కు తరలించారు.

ఆదోని: నకిలీ వైద్యులు నాగేంద్ర, ఆయన సమీప బంధువు జ్యోతిలను బుధవారం రిమాండ్‌కు తరలించారు.  పట్టణంలోని మేదరిగేరిలో విజయ గౌరి సూపర్‌ స్పెషాలిటీ, కర్నూలులోని జేపీ సూపర్‌ స్పెషాలిటీపై దాడులు చేసి నకిలీ వైద్యులు నాగేంద్ర, ఆయన సమీప బంధువు జ్యోతిని విజిలెన్స్‌ అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. బుధవారం తెల్లవారుజాము వరకు విచారణ కొనసాగింది. అనంతరం నిందితులను ఆదోని వన్‌ టౌన్‌ పోలీసులకు అప్పగించారు. ఇన్‌చార్జ్‌ డిప్యూటీ డీఎం అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌ టౌన్‌ ఎస్‌ఐ ఎస్‌కె బాబు నిందులపై ఐపీసీ 468, 471, 420, మెడికల్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితులను రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ బాబు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement