కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఈ నెల 7వ తేదీ నుంచి ఎండుమిర్చి తీసుకురావద్దని మార్కెట్ కమిటీ కార్యదర్శి నారాయణమూర్తి తెలిపారు.
7 నుంచి ఎండుమిర్చి కొనుగోళ్లు బంద్
Nov 6 2016 12:03 AM | Updated on Oct 1 2018 2:09 PM
	– రైతుల కోసం టోల్ ప్రీ నెంబర్ ఏర్పాటు
	 
	 
					
					
					
					
						
					          			
						
				
	కర్నూలు(అగ్రికల్చర్):  కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఈ నెల 7వ తేదీ నుంచి ఎండుమిర్చి తీసుకురావద్దని మార్కెట్ కమిటీ కార్యదర్శి నారాయణమూర్తి తెలిపారు. ఎండుమిర్చి కొనుగోళ్లు జరపలేమని కమీషన్ ఏజెంట్లు తెలిపినందున సోమవారం నుంచి కొనుగోళ్లు బంద్ చేస్తున్నట్లు శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. మళ్లీ ఎండుమిర్చి కొనుగోలు చేపడితే రైతులకు సమాచారం ఇస్తామన్నారు. ఇకపోతే రైతులు తమ సమస్యలను మార్కెట్ కమిటీ అధికారుల దృష్టికి తెచ్చేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్(18004252566)ను సంప్రదించాలన్నారు.
Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
