విశాఖ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.
పాయకరావుపేట: విశాఖ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పాయకరావుపేట మండలం నందవరం గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి యత్నించాడు.
తల్లిదండ్రులు లేని ఓ బాలిక గ్రామంలోని తన మేనమామ సంరక్షణలో ఉంటోంది. మంగళవారం రాత్రి ఆ బాలిక సమీపంలోని కిరాణ దుకాణానికి వెళ్తుండగా కోన రమణ అనే వ్యక్తి బలవంతంగా తన ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి యత్నించాడు. ఆమె గట్టిగా ఏడ్వటంతో వదిలిపెట్టాడు. దీనిపై బాధితురాలి మేనమామ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు రమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా నక్కపల్లి మండలం సీతంపాలెంలో ఓ బాలికపై రమణ లైంగిక దాడికి పాల్పడ్డినట్లు తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.