బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మెదక్ జిల్లా రేగోడ్ మండలం ఖాదిరాబాద్‌లో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై రాచకొండ రవీందర్ మంగళవారం ఆ ఘటన వివరాలు తెలిపారు.
రేగోడ్: బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మెదక్ జిల్లా రేగోడ్ మండలం ఖాదిరాబాద్‌లో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై రాచకొండ రవీందర్ మంగళవారం ఆ ఘటన వివరాలు తెలిపారు.
వాటి ప్రకారం.. గ్రామానికి చెందిన పద్నాలుగేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి అదే గ్రామానికి చెందిన మొగులయ్య సోమవారం సాయంత్రం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాదితురాలు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో మంగళవారం బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.