రేపటి నుంచి రంజాన్‌ ఉపవాసాలు | ramzan from tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి రంజాన్‌ ఉపవాసాలు

May 26 2017 11:09 PM | Updated on Sep 5 2017 12:03 PM

ఆకాశంలో నెలవంక శుక్రవారం సాయంత్రం కనిపించకపోవడంతో.. శనివారం తప్పనిసరిగా కనిపించే అవకాశాలు ఉన్నాయని.. ఆదివారం నుంచి రంజాన్‌ మాసం ప్రారంభమవుతున్నట్లు కర్నూలు ప్రభుత్వ ఖాజీ సలీంబాషా ఖాద్రి ప్రకటించారు.

కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఆకాశంలో నెలవంక శుక్రవారం సాయంత్రం కనిపించకపోవడంతో.. శనివారం తప్పనిసరిగా కనిపించే అవకాశాలు ఉన్నాయని.. ఆదివారం నుంచి రంజాన్‌ మాసం ప్రారంభమవుతున్నట్లు కర్నూలు ప్రభుత్వ ఖాజీ సలీంబాషా ఖాద్రి ప్రకటించారు. హిలాల్‌ కమిటీ తీర్మానం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రంజాన్‌ మాసపు ఉపవాసాలు అల్లాకు అత్యంత ప్రీతిపాత్రమైనవన్నారు. ఐదుపూటలా నమాజుతో పాటు తరావీ నమాజు చేయాలని, ఉపవాసాల్లో ధర్మనిష్ఠ పాటించాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement