రామాయం‍పేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలి | Ramayampetanu Revenue Division set up | Sakshi
Sakshi News home page

రామాయం‍పేటను రెవెన్యూ డివిజన్‌ చేయాలి

Sep 9 2016 8:18 PM | Updated on Mar 28 2019 4:53 PM

రామాయం‍పేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలి - Sakshi

రామాయం‍పేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలి

రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని రోజురోజుకు ఆందోళన తీవ్రతరమవుతుంది.

రామాయంపేట:రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని రోజురోజుకు ఆందోళన తీవ్రతరమవుతుంది. ఈమేరకు శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్యకర్తలు స్థానిక తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు మాట్లాడుతూ అన్ని హంగులున్న రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా  చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. గతంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో రామాయంపేట తాలూకా కేంద్రం రద్దయిందని,  ప్రస్తుతం మండలంలో  అత్యదికంగా  ఉన్న 70వేల జనాభాకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన వాపోయారు.

జాతీయ రహదారిపై ఉన్న రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసి ఇందులో చేగుంట, చిన్నశంకరంపేట, దౌల్తాబాద్‌, నార్సింగి, బిక్కనూరు తదితర మండలాలను కలిపే అవకాశం  ఉంటుందని  సుప్రభాతరావు పేర్కొన్నారు.  ఈవిషయమై ప్రభుత్వం పట్టించుకోకపోతే త్వరలో రామాయంపేట బందు నిర్వహించడంతో పాటు ఆందోళన ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌ ఆనందరావుకు వినతిపత్రం అందజేశారు

. ఈఆందోళనలో పార్టీ బీసీ సెల్‌ కన్వీనర్‌ విప్లవ్‌కుమార్‌, యూత్‌ కాంగ్రెస్‌ మెదక్‌ అసెంబ్లీ కన్వీనర్ హాస్నోద్దీన్‌, పార్టీ ఎస్టీ విభాగం జిల్లా ఉపాద్యక్షుడు గణేశ్‌నాయక్‌,  బీసీ సెల్‌ మండలశాఖ అధ్యక్షుడు చింతల స్వామి, పట్టణశాఖ కార్యదర్శి అల్లాడి వెంకటేశ్‌, ఇతర నాయకులు మధూగౌడ్‌, రాకేశ్‌, రాంకీ, అలీం, జీడిపల్లి సత్యం, భూమ సిద్దరాంలు తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement