రాగల 48 గంటల్లో తెలంగాణలో పలుచోట్ల వర్షాలు! | rains in telangana with in 48 hours, says visakhapatnam meteorological department | Sakshi
Sakshi News home page

రాగల 48 గంటల్లో తెలంగాణలో పలుచోట్ల వర్షాలు!

Jul 20 2016 9:50 AM | Updated on Sep 4 2017 5:29 AM

ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది.

విశాఖపట్నం : ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. ఇది కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతుందని తెలిపింది. రాయలసీమ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది.

ఈ నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని చెప్పింది. కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. రాగల 48 గంటల్లో తెలంగాణలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement