రాగల 24 గంటల్లో కోసాంధ్రలో వర్షాలు | rains in coastal andhra, says visakhapatnam meteorological department | Sakshi
Sakshi News home page

రాగల 24 గంటల్లో కోసాంధ్రలో వర్షాలు

Sep 10 2015 2:21 PM | Updated on Sep 3 2017 9:08 AM

మరో రెండు లేదా మూడు రోజుల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెెల్లడించింది.

విశాఖపట్నం : మరో రెండు లేదా మూడు రోజుల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది.

అలాగే ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.  
 

Advertisement
 
Advertisement
Advertisement