కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు | Rains in coastal andhra | Sakshi
Sakshi News home page

కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు

Sep 20 2015 8:13 AM | Updated on Sep 3 2017 9:41 AM

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే 5.8 కి. మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలు చోట్ల విస్తారంగా వర్షాలు పడతాయని పేర్కొంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.

అల్పపీడన ప్రాంతం ఏపీ తీరానికి సమీపంలో ఉండటంతో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది. తెలంగాణలో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement