చోరీకి యత్నించిన మహిళలకు దేహశుద్ధి | ragpicker's attacked by local people | Sakshi
Sakshi News home page

చోరీకి యత్నించిన మహిళలకు దేహశుద్ధి

Sep 12 2015 11:49 AM | Updated on Sep 3 2017 9:16 AM

గుంటూరు జిల్లా బాపట్ల మండలం చర్లపాడులో శనివారం ఇద్దరు మహిళలు చోరీకి యత్నిస్తుండగా స్థానికులు వారిని పట్టుకుని దేహశుద్ది చేశారు.

బాపట్ల : గుంటూరు జిల్లా బాపట్ల మండలం చర్లపాడులో శనివారం ఇద్దరు మహిళలు చోరీకి యత్నిస్తుండగా స్థానికులు వారిని పట్టుకుని  దేహశుద్ది చేశారు. చల్లపాడులోని ఎలక్ట్రీషియన్ షేక్ సైదా ఇంట్లోకి శనివారం ఇద్దరు మహిళలు చోరబడి ఇంట్లోని వస్తువులన్నీ మూటగట్టి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కుటుంబసభ్యులు వారి ప్రయత్నాన్ని అడ్డుకుని.. వారికి దేహశుద్ది చేశారు.

చెత్తలో ప్లాస్టిక్ వస్తువులు ఏరుకునే ఇద్దరు మహిళలు అటుగా వెళుతూ ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో షేక్ సైదా ఇంట్లోకి చోరబడ్డారు. ఇంట్లో కనిపించిన వస్తువులన్నీ తీసుకుని మూటకట్టి తీసుకెళుతుండగా పెరట్లో ఉన్న కుటుంబసభ్యులు చూసి వారిని పట్టుకున్నారు. అనంతరం వారికి దేహశుద్ది చేసి చోరీ చేసిన వస్తువులను స్వాధీనం చేసుకుని... పోలీసులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement