17న రఘువీరా పాదయాత్ర | raghuveera walkint tour on 17th | Sakshi
Sakshi News home page

17న రఘువీరా పాదయాత్ర

Oct 13 2016 11:37 PM | Updated on Sep 4 2017 5:05 PM

పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈ నెల 17న మండలంలోని కొట్టువారిపల్లి నుంచి ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం తెలిపారు.

అమడగూరు : పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈ నెల 17న మండలంలోని కొట్టువారిపల్లి నుంచి ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం తెలిపారు. గురువారం ఆయన మండలానికి వి చ్చేసి పాదయాత్ర నిర్వహించే రోడ్డు మార్గాన్ని పరిశీలించా రు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.  పాద యాత్రలో భాగంగా అమడగూరుకు వచ్చే దారి మీదుగా పొలాల్లో పర్యటిస్తూ రఘువీరారెడ్డి రైతులతో మాట్లాడతారన్నారు.

అదే దారిలో సీఎం చంద్రబాబు రెయిన్‌గన్లు ప్రారంభించిన శివన్నతో ముఖాముఖి నిర్వహిస్తారన్నారు. అనంతరం అమడగూరులో బహిరంగ సమావేశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నాగరాజారెడ్డి, కన్వీనర్‌ బాబాఫకృద్ధీన్‌, యూత్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement