జ్వరాల బారిన పడి చనిపోతున్నా ప్రభుత్వం కనీస మాత్రమైనా పట్టించుకున్న పాపాన పోలేదని గిరిజనులు గర్జించారు.
జ్వరాల బారిన పడి చనిపోతున్నా ప్రభుత్వం కనీస మాత్రమైనా పట్టించుకున్న పాపాన పోలేదని గిరిజనులు గర్జించారు. సుమారు 700 మంది గిరిజనులు బుధవారం మధ్యాహ్నం విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. మలేరియా జ్వరాలు ఏజన్సీని అతలాకుతలం చేస్తున్నా అధికార యంత్రాంగంలో ఉలుకూపలుకూ లేదని ఆరోపించారు. వందలాది మంది వ్యాధిబారిన పడి చనిపోతున్నా టీడీపీ ప్రభుత్వంలో చలనం లేదని అన్నారు. ఐటీడీఏ పీవో లేరు...పాలకవర్గం సమావేశాలు లేవు...ఇలా ఎన్నాళ్లు గడుపుతారని ప్రశ్నించారు. ఏజన్సీలో రహదారులు కూడా సరిగ్గా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఐటీడీఏ పీవోగా ఇన్‌ఛార్జి కలెక్టర్ వ్యవహరిస్తున్నారు. ఆయన విజయనగరం జిల్లాకేంద్రంలో ఉంటారు. ఆయన వచ్చేదాకా తమ నిరసన కొనసాగుతుందని గిరిజనులు నినదించారు.