రాష్ట్ర టీ 20 జట్టుకు ప్రేమ్‌ | prem select to state t20 team | Sakshi
Sakshi News home page

రాష్ట్ర టీ 20 జట్టుకు ప్రేమ్‌

Sep 4 2016 12:17 AM | Updated on Apr 8 2019 8:07 PM

రాష్ట్ర టీ 20 జట్టుకు ప్రేమ్‌ - Sakshi

రాష్ట్ర టీ 20 జట్టుకు ప్రేమ్‌

జంగారెడ్డిగూడెం : తమ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి కె.జస్వంత్‌ సాయి ప్రేమ్‌ అనే విద్యార్థి రాష్ట్రస్థాయి టీ20 క్రికెట్‌ జట్టుకు ఎంపికైనట్టు ప్రతిభ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల ప్రిన్సిపాల్‌ కాసర లక్ష్మీ సరోజారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

జంగారెడ్డిగూడెం : తమ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి కె.జస్వంత్‌ సాయి ప్రేమ్‌ అనే విద్యార్థి రాష్ట్రస్థాయి టీ20 క్రికెట్‌ జట్టుకు ఎంపికైనట్టు ప్రతిభ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల ప్రిన్సిపాల్‌ కాసర లక్ష్మీ సరోజారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఏపీ యూత్‌ టీ20 క్రికెట్‌ అసోసియేషన్‌ నిర్వహించిన నేషనల్‌ యూత్‌ టీ20 క్రికెట్‌ చాంపియన్‌ షిప్‌ సెలక్షన్స్‌లో ప్రేమ్‌ ప్రతిభ చూపినట్టు చెప్పారు. సెప్టెంబర్‌ 11 నుంచి కోల్‌కతాలో నిర్వహించనున్న టీ20 టోర్నమెంట్‌లో ప్రేమ్‌ పాల్గొంటాడని చెప్పారు. ఈ సందర్భంగా ప్రేమ్‌ను స్కూల్‌ డైరెక్టర్‌లు సత్యనారాయణరెడ్డి, సుభాష్‌రెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement