ట్రైనింగ్ వెళ్లకుండానే ... యువకుడు ఆత్మహత్య | prabhudas suicide in nalgonda district | Sakshi
Sakshi News home page

ట్రైనింగ్ వెళ్లకుండానే ... యువకుడు ఆత్మహత్య

Aug 21 2016 10:29 AM | Updated on Nov 6 2018 8:04 PM

ఉద్యోగంలో చేరాల్సిన రోజే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

నల్గొండ : ఉద్యోగంలో చేరాల్సిన రోజే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లా వలిగొండ మండలం సుంకిశాలలో ఆదివారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ప్రభుదాసు ఇటీవలే ఆర్మీకి ఎంపికయ్యాడు. అందులోభాగా ఈ రోజే ట్రైనింగ్కు వెళ్లాల్సి ఉంది.

అయితే గ్రామంలోని బావి వద్ద ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం గ్రామస్థులు ప్రభుదేసు మృతదేహాన్ని చూసి ... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement