సామర్ధ్యానికి మించిన విద్యుదుత్పత్తి
ముత్తుకూరు : మండలంలోని నేలటూరులోని దామోదరం సంజీవయ్య ఏపీజెన్‌కో సూపర్‌క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం గురువారం సరికొత్త రికార్డును సృష్టించింది.
-
2వ యూనిట్‌లో 848 మెగావాట్లు
-
జెన్‌కో ప్రాజెక్ట్‌లో సరికొత్త రికార్డు
ముత్తుకూరు : మండలంలోని నేలటూరులోని దామోదరం సంజీవయ్య ఏపీజెన్‌కో సూపర్‌క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం గురువారం సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రాజెక్ట్‌లోని 2వ యూనిట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 800 మెగావాట్లు కాగా అనూహ్యంగా 848 మెగావాట్ల ఉత్పత్తి కొనసాగించింది. ఒక్క సారిగా బోర్డులో సామర్ధ్యానికి మించి ఉత్పత్తి నమోదు కావడం చూసి ఇంజనీర్లు పెద్ద సంఖ్యలో చేరి, సంతోషంతో కేరింతలు కొట్టారు. ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. బీహెచ్‌ఈఎల్, ఆపరేషన్, మెయింటినెన్స్ ఇంజనీర్లకు సీఈ చంద్రశేఖరరాజు అభినందనలు చెప్పారు. ఆయన మాట్లాడుతూ 2వ యూనిట్ ఉత్పత్తికి సంబంధించి ఇదో సరికొత్త రికార్డు అన్నారు. బీహెచ్‌ఈఎల్ ప్రతినిధి శిఖామణి, ఎస్‌ఈలు రమేష్‌ముని, శ్రీనివాసబాబు, కేవీ రమణారెడ్డి, దేవప్రసాద్, రమణారెడ్డి, జీఎం భాస్కరరావు, ముఖ్యసంక్షేమ అధికారి లక్ష్మీనారాయణ, మాధవశర్మ, అభిమన్యుడు పాల్గొన్నారు.