కొనసాగుతున్న పోలీసుల మోహరింపు | police protection continue | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న పోలీసుల మోహరింపు

Nov 17 2016 12:10 AM | Updated on Aug 21 2018 5:51 PM

కొనసాగుతున్న పోలీసుల మోహరింపు - Sakshi

కొనసాగుతున్న పోలీసుల మోహరింపు

పోలీసు నిఘా చర్యలు కోనసీమలో కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కోనసీమ వ్యాప్తంగా ఆరు వేల మంది పోలీసులను మోహరింపజేసి ఆధునాతన పోలీసు సాంకేతిక వాహనాలను సిద్ధం చేసుకున్నా బుధవారం ఉదయానికి కర్ణాటక రాష్ట్రం నుంచి రాపిడ్‌

  • కాపు నేత తాతాజీని కాకినాడ నుంచి అమలాపురానికి
  • తరలింపు...హౌస్‌ అరెస్ట్‌
  • ఇంకా అజ్ఞాతంలోనే కాపు జేఏసీ నేతలు విష్ణుమూర్తి, పవ¯ŒSకుమార్‌
  • వారి కోసం రెండు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు
  • కర్ణాటక నుంచి అమలాపురానికి అదనంగా ఆర్‌ఏఎఫ్‌ దళాలు
  • డీఐజీ రామకృష్ణ నలుగురు ఎస్పీలతో సమీక్షలు
  • అమలాపురం టౌ¯ŒS :
    పోలీసు నిఘా చర్యలు కోనసీమలో కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కోనసీమ వ్యాప్తంగా ఆరు వేల మంది పోలీసులను మోహరింపజేసి ఆధునాతన పోలీసు సాంకేతిక వాహనాలను సిద్ధం చేసుకున్నా బుధవారం ఉదయానికి కర్ణాటక రాష్ట్రం నుంచి రాపిడ్‌ ఏక్ష¯ŒS ఫోర్సు (ఆర్‌ఏఎఫ్‌)కు చెందిన నాలుగు దళాలను అమలాపురానికి అదనంగా రప్పించారు. డీఎస్పీ లంక «ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఆర్‌ఏఎఫ్‌ దళాలు పుర వీధుల్లో కవాతు నిర్వహించాయి. ఏలూరు రేంజ్‌ డీఐజీ పీవీఎస్‌ రామకృష్ణ కోనసీమలోనే మకాం చేసి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. యాత్రను అడ్డుకునే నేపధ్యంలో కోనసీమకు ప్రత్యేక పర్యవేక్షణ అధికారులుగా నియమితులైన చిత్తూరు, ప్రకాశం, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు జి.శ్రీనివాస్, తివిక్రమ వర్మ, విజయకుమార్, బ్రహ్మారెడ్డి రావులపాలెం, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు ప్రాంతాల్లో ఉండి శాంతి భద్రతల పరిస్థితులు, కాపు నేతల అరెస్ట్‌లు, తదినంతర పరిణామాలపై క్షణం క్షణం సమీక్షిస్తున్నారు. నలుగురు ఎస్పీలతో కూడా డీఐజీ పలుమార్లు చర్చించారు. జిల్లాలో ముఖ్య కాపు నేతందలరూ అరెస్ట్‌ లేదా హౌస్‌ అరెస్ట్‌లు చేసేదాకా కోనసీమలో ఈ ముమ్ముర పోలీసు మోహరింపు కొనసాగుతాయని తెలిసింది. 
    తాతాజీని కాకినాడ నుంచి అమలాపురానికి తరలింపు...
    కోనసీమ తెలగ, బలిజ, కాపు (టీబీకే) అధ్యక్షుడు కల్వకొలను తాతాజీని అమలాపురంలో మంగళవారం సాయంత్రం అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను మంగళవారం రాత్రి పట్టణ పోలీసు స్టేష¯ŒS నుంచి కాకినాడకు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా స్థానిక కాపు యువకులు అడ్డుకోవటమే కాకుండా ధర్నా చేసిన విషయమూ విదితమే. యువకుల ఆందోళన విరమించాక తాతాజీని మంగళవారం అర్థరాత్రి పట్టణ పోలీసు స్టేష¯ŒS నుంచి కాకినాడ పోర్టు పోలీసు స్టేష¯ŒSకు తరలించారు. అయితే తాతాజీని బుధవారం మధ్యాహ్నం కాకినాడ నుంచి అమలాపురానికి తీసుకువచ్చి హౌస్‌ అరెస్ట్‌ చేశారు.  
    అజ్ఞాతంలోనే విష్ణుమూర్తి, పవ¯ŒSకుమార్‌లు ...
    రాష్ట్ర కాపు రిజర్వేష¯ŒS పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, రాష్ట్ర కాపు జేఏసీ నాయకుడు నల్లా పవ¯ŒSకుమార్‌లు మంగళవారం సాయంత్రం నుంచి కాపు నేతల అరెస్టులపర్వం మొదలు కాగానే వారిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరి కోసం పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో రెండు  బృందాలు గాలించినప్పటికీ  ఉనికి తెలియరాలేదు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement