‘ఫైన్‌’యాపిల్‌ | pinapple sales | Sakshi
Sakshi News home page

‘ఫైన్‌’యాపిల్‌

Jul 17 2016 7:00 PM | Updated on Sep 4 2017 5:07 AM

ఉత్తరాంధ్రకు ప్రత్యేకమైన రామభద్రపురం మార్కెట్‌లో పైనాపిల్‌ పండ్లకు గిరాకీ ఏర్పడింది. ఏ దుకాణం వద్ద చూసినా పండ్లను రాశులుగా పోసి విక్రయాల చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట, పాలకొండ, కుసుమ ప్రాంతాల నుంచి వీటిని తీసుకొస్తున్నారు.

రామభద్రపురం, పార్వతీపురం : ఉత్తరాంధ్రకు ప్రత్యేకమైన రామభద్రపురం మార్కెట్‌లో పైనాపిల్‌ పండ్లకు గిరాకీ ఏర్పడింది. ఏ దుకాణం వద్ద చూసినా పండ్లను రాశులుగా పోసి విక్రయాల చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట, పాలకొండ, కుసుమ ప్రాంతాల నుంచి వీటిని తీసుకొస్తున్నారు. పండు పరిమాణం బట్టి రూ.10 నుంచి రూ.25 వరకు విక్రయిస్తున్నారు. అంతర్రాష్ట్ర మార్కెట్‌ కావడంతో చత్తీస్‌ఘడ్, ఒడిశా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వారు కూడా వీటిని కొనుగోలు చేసి పట్టుకెళ్తున్నారు. పార్వతీపురం మార్కెట్‌లో ఒక్కొక్క పండు రూ.30 పలుకుతోంది. గత ఏడాది కన్నా ఈ ఏడాది ఎక్కువ ధర పలుకుతోందని వినియోగదారులంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement