‘పినాకినీ’ కష్టాలు.. | Pinakini express halt cancelled at Naidupet | Sakshi
Sakshi News home page

‘పినాకినీ’ కష్టాలు..

Aug 14 2016 12:01 AM | Updated on Sep 4 2017 9:08 AM

‘పినాకినీ’ కష్టాలు..

‘పినాకినీ’ కష్టాలు..

నాయుడుపేట: ఓ వైపు టికెట్లు ఇస్తూనే మరోవైపు నాయుడుపేటలో పినాకిని ఎక్స్‌ప్రెస్‌ను నిలపకపోవడంతో ప్రయాణికులు చైన్‌ లాగి ఆపుతున్నారు. వరుసగా రెండో రోజూ కూడా చైన్‌ లాగిపోవడంతో రైలు ఆగిపోయింది.

 
 నాయుడుపేట: ఓ వైపు టికెట్లు ఇస్తూనే మరోవైపు నాయుడుపేటలో పినాకిని ఎక్స్‌ప్రెస్‌ను నిలపకపోవడంతో ప్రయాణికులు చైన్‌ లాగి ఆపుతున్నారు. వరుసగా రెండో రోజూ కూడా చైన్‌ లాగిపోవడంతో రైలు ఆగిపోయింది. ఈ క్రమంలో లోకోపైలెట్లతో పాటు ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది హుటాహుటిన పరుగులు తీసి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలో టికెట్లు ఇచ్చినందునే తాము ఎక్కామని యువకులు సమాధానమిచ్చారు. మరోవైపు పినాకిని ఎక్స్‌ప్రెస్‌ ఆకస్మాత్తుగా ఆపేయడంతో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ కూడా ఐదు నిమిషాలు నిలిచిపోయింది. 

Advertisement
 
Advertisement
Advertisement