జ్వరాల నియంత్రణలో ప్రభుత్వం విఫలం | phc not usefull | Sakshi
Sakshi News home page

జ్వరాల నియంత్రణలో ప్రభుత్వం విఫలం

Sep 21 2016 10:51 PM | Updated on May 29 2018 2:44 PM

రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధులను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌ సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ మెహబూబ్‌ షేక్‌ పేర్కొన్నారు. డెంగీ, విషజ్వరాలతో ప్రజలు మరణిస్తున్నా.. కనీస చర్యలు తీసుకోవడం లేదని ఆయన బుధవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తంచేశారు.

 
వైఎస్సార్‌ సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ మెహబూబ్‌ షేక్‌
విజయవాడ (లబ్బీపేట) : 
రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధులను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌ సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ మెహబూబ్‌ షేక్‌ పేర్కొన్నారు. డెంగీ, విషజ్వరాలతో ప్రజలు మరణిస్తున్నా.. కనీస చర్యలు తీసుకోవడం లేదని ఆయన బుధవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తంచేశారు. జ్వరాల అదుపునకు క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టాల్సి ఉండగా, దోమలపై యుద్ధం.. అంటూ ప్రచార కార్యక్రమాలకే పరిమితం కావడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో వేలాది మంది జ్వరపీడితులు ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. పలువురు మరణించారని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని నగరమైన విజయవాడలోనే జ్వరం వస్తే నిర్ధారణ పరీక్షలు చేయలేని దుస్థితిలో పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉండటం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని, జ్వరాలు ప్రబలిన గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. 
 
 
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement